వృద్ధి అంచనాలను 7.2 శాతానికి పెంచిన ఫిచ్​

 వృద్ధి అంచనాలను 7.2 శాతానికి పెంచిన ఫిచ్​

న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాను రేటింగ్ ​ఏజెన్సీ ఫిచ్ మంగళవారం మార్చింది. ఈ ఏడాది మార్చి అంచనా 7 శాతాన్ని 7.2 శాతానికి పెంచింది. ఖర్చు,  పెరిగిన పెట్టుబడి ఇందుకు కారణమని పేర్కొంది.   2025–-26,  2026–-27 ఆర్థిక సంవత్సరాలకు ఇది వరుసగా 6.5 శాతం  6.2 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది.   ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ బలంగా విస్తరిస్తుందని ఆశిస్తున్నట్టు ఫిచ్ తన గ్లోబల్ ఎకనామిక్ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుక్ నివేదికలో పేర్కొంది. 

గ్రామీణ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరచడం,  ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధి చెందుతుందని ఈ నెల ప్రారంభంలో అంచనా వేసిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ అంచనాలకు అనుగుణంగా ఫిచ్ అంచనాలు ఉన్నాయి. పెట్టుబడులు పెరగడం కొనసాగుతుందని,  వినియోగదారుల వ్యయం పెరగడం వల్ల వృద్ధి బాగుంటుందని ఫిచ్​ తెలిపింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వృద్ధి కొనసాగుతుందని పర్చేజింగ్​ మేనేజర్ల సర్వే డేటా సూచించిందని   తెలిపింది.   గత ఆర్థిక సంవత్సరం (2023–-24)లో భారత ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధిని సాధించింది. మార్చి క్వార్టర్​లో 7.8 శాతం వృద్ధిని సాధించింది.  ఫిచ్ అంచనా ప్రకారం, 2024 చివరి నాటికి ద్రవ్యోల్బణం 4.5 శాతానికి తగ్గుతుంది.