నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి వరకు .. దేశంలోనే అతిపెద్ద రెండో మారథాన్

హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో NMDC హైదరాబాద్ మారథాన్ 13వ ఎడిషన్ గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు మారథాన్ కొనసాగింది. ఫుల్ మారథాన్ ను జెండా ఊపి.. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. మారథాన్ లో వివిధ దేశాలకు చెందిన రన్నర్లు పాల్గొన్నారు.

 ప్రతి ఏడాది నిర్వహించే ఈ మారథాన్.. ఫిట్ నెస్ అవేర్నెస్ పెంచేందుకు దోహదం చేస్తోందని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దేశంలో అతిపెద్ద రెండో మారథాన్ గా ఇది నిలుస్తుందని చెప్పారు. 60,70 ఏండ్లల్లో వచ్చే వ్యాధులు ఇప్పటి నుంచే యువత ఎదుర్కొంటుందన్నారు సీపీ. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరన్నారు. ఈ కార్యక్రమానికి   సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మారథాన్ గెలిచిన రన్నర్స్ కి మెడల్స్  అందజేయనున్నారు.