హైదరాబాద్: రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల డ్రైవర్లకు ఫిటినెస్టెస్టులు చేయాలని నిశ్చయించుకుంది. మీడియాతో చిట్ చాట్సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్వివరాలు వెల్లడించారు. ‘ప్రముఖుల దగ్గర ఉన్న డ్రైవర్లకు ఫిట్నెస్ టెస్ట్ చేస్తం. ఈ ప్రక్రియను మూడు, నాలుగు రోజుల్లో స్టార్ట్ చేస్తం. దీనికి సంబంధించి అందరికీ లేఖ రాస్తున్నం. డిపార్ట్మెంట్ సుమోటోగా చేస్తం. మహాలక్ష్మి స్కీం కింద కండక్టర్లు అనవసరంగా టికెట్లు కొడితే.. పట్టుబడితే చర్యలు తీసుకుంటాం. గతంలో రెగ్యులర్ గా 44 లక్షల ప్రయాణాలు ఉంటే.. ఇప్పుడు 55 లక్షలకు పైగా ఉంది. ఆటో డ్రైవర్లకు ఒక సమస్య ఉంది.
ప్రతిఏటా వారికి రూ.12వేల ఆర్థిక సాయం ఇస్తామన్నం. ఆ హామీని నెరవేరుస్తం. ఆటోలు 2023 డిసెంబర్ నుంచి 2024 వరకు కొత్తగా గతంలో కంటే ఎక్కువ కొన్నారు. 2023 అక్టోబర్ లో జీహెచ్ఎంసీ 453, నాన్ జీహెచ్ఎంసీ 3,030 కొత్త ఆటోలు కొంటే.. 2024 జనవరిలో జీహెచ్ఎంసీలో 233, నాన్ జీహెచ్ఎంసీలో 1,836 ఆటోలు కొనుగోలు చేశారు. ఆటోలకు నష్టం ఉంటే.. కొత్తవి ఎందుకు కొంటారు’ అని పొన్నం ప్రశ్నించారు.
కులగణనపై అధికారులకు ట్రైనింగ్ఇస్తం
హైదరాబాద్:తెలంగాణలో కుల గణనపై అధికారులకు శిక్షణ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్తెలిపారు. ఇండ్ల సంఖ్యను బట్టి ఆఫీసర్లను నియమిస్తామన్నారు. ‘బీహార్ లో 2.5 లక్షల మంది అధికారులను కేటాయించి.. ఒక్కొక్కరికి 150 ఇండ్లు ఇచ్చారు. ఇక్కడ కూడా ఇళ్లను బట్టి.. ఆఫీసర్లను నియమిస్తాం. నోడల్ ఆఫీసర్ గా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది’ అని పొన్నం వెల్లడించారు.