నారాయణపేట, వెలుగు : నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పేరిట ఫేక్ లెటర్ తయారు చేసి జాబ్ కోసం అందజేసిన కేసులో ఐదుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు. సీఐ శివశంకర్తెలిపిన ప్రకారం.. నర్వ మండలం పెద్ద కడుమూరుకు చెందిన సాకలి శైలేశ్2017లో బీసీ గురుకుల స్కూల్ లో గెస్ట్ లెక్చరర్ లో పనిచేశాడు. అతనికి స్కూల్ అధికారులతో పరిచయం ఉంది.
దీంతో గురుకుల సీట్లు, జాబ్ లు ఇప్పిస్తానని చెప్పుకుంటున్నాడు. మరికల్‌లోని కోటకొండ బీసీ గురుకుల స్కూల్ వాచ్మెన్ పోస్టుకు పైరవీ చేస్తానని అక్కడి స్వీపర్ కు తెలిపాడు. దీంతో అతడు తన బంధువు జ్యోతి, మరో మహిళ సత్యమ్మకు తెలిపాడు. వారిద్దరూ శైలేశ్ ను సంప్రదించగా రూ.లక్ష అడగడంతో ఒప్పుకున్నారు. సత్యమ్మ రూ.లక్ష జ్యోతికి ఇవ్వగా ఆమె అందులోంచి రూ.85 వేలను శైలేశ్ కు ఇచ్చింది.
నారాయణపేటలో జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు అరుణ్‌కు శైలేశ్ రూ.5 వేలు ఇచ్చి ఎమ్మెల్యే లెటర్‌ను ఎడిట్చేసి కలర్ జిరాక్స్తీసుకుని సంతకం కూడా ఫోర్జరీ చేశాడు. అనంతరం హైదరాబాద్‌లోని బీసీ వెల్ఫేర్ ఆఫీసులో అందజేశారు. అక్కడి నుంచి మరికల్ ప్రిన్సిపల్‌కు అందేటట్లుగా చేశాడు. స్కూల్ కు వచ్చిన లెటర్ ను చూసిన స్కూల్ ప్రిన్సిపల్ అనుమానించి.. ఎమ్మెల్యే ఆఫీస్‌లో తెలపడంతో ఫేక్ దిగా గుర్తించిన ఎమ్మెల్యే అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి నిందితులైన శైలేశ్, జ్యోతి, సత్యమ్మ, రాందాస్, అరుణ్‌ను అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్ కు తరలించామని సీఐ
తెలిపారు.