కాగజ్ నగర్, వెలుగు: పెంచికల్పేట్ మండలం లోడ్ పల్లి గ్రామంలో విద్యుత్ తీగలు అమర్చి కొండగొర్రెను హతమార్చిన ఇద్దరు నిందితులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేసి సిర్పూర్(టి) కోర్టులో హాజరుపర్చగా వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు. పెంచికల్పేట్ ఇన్చార్జ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. లోడ్ పెల్లికి చెందిన గడ్డం శ్రీ శైలం, లావుడె రమేశ్, మరో ముగ్గురు మైనర్లు కలిసి ఈనెల 16న అక్రమంగా కరెంట్ వైర్లను అమర్చి కొండ గొర్రెను చంపారు.
ఈ ఘటనపై అయిదుగురు నిందితుల మీద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్1972 కింద కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఇద్దరు మేజర్లకు 14 రోజుల రిమాండ్ విధించగా.. మిగిలిన ముగ్గురు మైనర్లను ఆసిఫాబాద్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జవైనల్) ముందు హాజరు పరుచగా వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపారు. వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి రేంజర్ హెచ్చరించారు.