లాభాల పేరుతో మోసం ఐదుగురు అరెస్టు

లాభాల పేరుతో మోసం ఐదుగురు అరెస్టు

మునగాల, వెలుగు: తక్కువ రోజులలో ఎక్కువ మొత్తం లో డబ్బులు సంపాదించవచ్చని ప్రచారం చేసిన ఐదుగురిని మునగాల పోలీసులు  బుధవారం అరెస్టు చేశారు.  మునగాల సర్కిల్​ సీఐ   రామ కిష్ణారెడ్డి  వివరాల ప్రకారం... మండలంలోని బరాఖత్​గూడెం గ్రామానికి చెందిన ఏనుగుల శంకర్ రావు, బేతం ప్రభాకర్ రెడ్డి, గండు యల్లయ్య , అజయ్, రెడ్డిపల్లి బుచ్చిబాబు, కేతావత్ మూన్ సింగ్, అలీన్ తో కలిసి  సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ ,  కూసుమంచిలో ఆర్​జీఎ ఆఫీసులు ఓపెన్ చేశారు.

దీని ద్వారా  అమాయకులైన ప్రజలకు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయని ప్రచారం చేశారు. ఈ స్కీమ్ గురించి ఎక్కువగా ప్రచారం చేసి డబ్బులు సంపాదించవచ్చని నమ్మించారు.  ఎక్కువ  లాభాలు వస్తాయని ఆశ చూపి దానిలో వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని పెట్టుబడి పెట్టించి మోసం చేశారు. వారిని అరెస్ట్ చేసి వారి నుంచి  3.5 లక్షలు , 5సెల్ ఫోన్లు  స్వాధీనం చేసుకొని   రిమాండ్​కు తరలించారు.