ఎందుకు ఇలా : కొత్త వందేభారత్ రైలుపై రాళ్ల దాడి : ఐదుగురి అరెస్ట్

ఎందుకు ఇలా : కొత్త వందేభారత్ రైలుపై రాళ్ల దాడి : ఐదుగురి అరెస్ట్

ఛత్తీస్‌గఢ్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. మహాసముంద్‌లోని బాగ్‌బహ్రా రైల్వే స్టేషన్ సమీపంలో దుర్గ్.. విశాఖపట్నం  వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ చేస్తుండగా.. దుండగులు రైలుపై రాళ్లు రువ్వడంతో మూడు కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..వీరిపై పోలీసులు రైల్వే చట్టం 1989 కింద కేసు నమోదు చేశారు.  

ALSO READ | వందేభారత్ మెట్రో రైళ్లు వచ్చేస్తాయ్: ఈ రైలు ప్రత్యేకలు ఏంటీ.. మెట్రో అని పేరు ఎందుకు పెట్టారు..?

రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల్లో ఒకరు కౌన్సిలర్ సోదరుడు అని పోలీసులు పేర్కొన్నారు.  రాళ్ల దాడిలో సీ2-10, సీ4-1, సీ9-78 కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. బాగ్‌బహ్రా రైల్వే స్టేషన్‌లో ఈ రాళ్ల దాడి జరిగింది.   16 నుంచి నడవనున్న వందేభారత్ రైలుకు ట్రయల్ రన్ జరుగుతుండగా, రాళ్ల దాడి చోటుచేసుకున్నదని ఆర్‌పీఎఫ్ అధికారి పర్వీన్ సింగ్ తెలిపారు.