- రూ.36.60 లక్షల విలువైన 51 బైకులు స్వాధీనం
కామారెడ్డి, వెలుగు : బైక్దొంగతనాలకు పాల్పడుతున్న అయిదుగురు దొంగల్ని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరు కరడుగట్టిన అంతర్ రాష్ట్ర దోపిడి దొంగ. మరో నలుగురు అంతర్జిల్లా దొంగలు. వీరి నుంచి రూ.36.60 లక్షలు విలువైన 51 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ఆఫీసులో ఎస్పీ బి.శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇటీవల జిల్లాలో వరుసగా బైక్చోరీలు జరుగుతున్న నేపథ్యంలో అడిషనల్ఎస్పీ నర్సింహారెడ్డి, డీఎస్పీ ప్రకాశ్పర్యవేక్షణలో సీసీఎస్, టౌన్పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారన్నారు.
మహారాష్ట్రలోని జాల్నా గురు గోవింద్నగర్కు చెందిన జుల్పీ సింగ్అలియాస్ సూరత్‌సింగ్ మహారాష్ట్రతో పాటు పలు ఏరియాల్లో దోపిడీలకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలో ఇతడిపై పలు కేసులు ఉన్నాయి. కరోనా టైమ్‌లో ఫేరోల్పై ఇంటికొచ్చి తప్పించుకొని తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. బాన్సువాడ, కరీంనగర్‌లలో ఉంటూ బైక్‌లు చోరీ చేస్తున్నాడు.మంగళవారం కామారెడ్డిలో బైక్‌పై వెళ్తుండగా ఇతడ్ని పట్టుకొని ఎంక్వైరీ చేయగా బైక్చోరీల విషయం బయట పడింది. ఇతడి నుంచి 12 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు.
మరో నలుగురు ..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆజాంపురాకు చెందిన షేక్యూనుస్, బాన్సువాడకు చెందిన షేక్ సోయెల్, హైదరాబాద్‌లోని యాకుత్‌పుర వాసి సోహెల్అలీ, నారాయణ్‌పేట జిల్లా వాసి (ప్రస్తుతం బంజరాహిల్స్) చప్పల అంజప్పకలిసి పలు జిల్లాల్లో బైక్‌లను చోరీ చేస్తున్నారు. కామారెడ్డిలో బైక్‌లపై వెళ్తుడగా కస్తూరీబా హాస్పిటల్ సమీపంలో పోలీసులు వెహికిల్స్తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డట్లు ఎస్పీ తెలిపారు. అనుమానంతో ఎంక్వైరీ చేయగా బైక్దొంగలుగా గుర్తించారు. వీరి నుంచి 39 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : ప్రతి ఒక్కరికీ సొంతిళ్లు ఉండాలన్నదే కేసీఆర్ కల : తలసాని
బైక్‌లు చోరీ చేసి తీసుకొచ్చి అమ్ముతుంటే తక్కువ రేట్లకు కొనుగోలు చేస్తున్న నలుగురు వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ చెప్పారు. పిట్లంకు చెందిన షేక్ఇర్ఫాన్, బిచ్కుంద వాసి షేక్హమీద్, బాన్సువాడకు చెందిన మహ్మద్ ఉమేర్, కామారెడ్డి బతుకమ్మకుంట వాసి షేక్అల్తాఫ్లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, డీఎస్పీ ప్రకాశ్, సీఐలు నరేశ్, మల్లేశ్‌గౌడ్, ఎస్ఐలు ఉస్మాన్, అనిల్, ఏఎస్ఐలు రాజేశ్వర్‌రావు, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.