సూర్యాపేటలో ఘోర ప్రమాదం... ఐదు గేదెలు మృతి

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలో  2024 జులై 02వ తేదీ మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  జాతీయ రహదారి 365పై గేదెల లోడుతో వెళుతున్న డీసీఎంను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు గేదెలు మృతి చెందాయి. భద్రాద్రి కొత్తగూడెం నుండి హైదరాబాద్ కు వెళ్తున్న డీసీఎంలో 20 గేదెలను తీసుకువెళ్తున్నారు.  కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం డ్రైవర్  రోడ్డుపై డీసీఎంను అపాడు.  ఈ క్రమంలో వేగంగా వచ్చిన లారీ డీసీఎంను ఢీకొట్టింది. ఘటన స్థలాని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.