కాంగ్రెస్ ఆరవ లిస్ట్‌లో  ఐదుగురు అభ్యర్థులు రాజస్థాన్‪, తమిళనాడు సీట్లు కేటాయింపు

పార్లమెంట్ లోక్‪సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆరవ జాబితాని రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో రాజస్థాన్ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ఒక అభ్యర్థిని ఖరారు చేసింది. 
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ నుంచి రామచంద్ర చౌదరి, భిల్వారా నుంచి డాక్టర్ దామోద గుర్జార్, కోటాలో ప్రహ్లాద్ గుంజాల్, రాజ్ సమంద్ నుంచి సుదర్శన్ రావత్ ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. తమిళనాడు తిరునెల్వేలి లోక్ సభ నియోజకవర్గం నుంచి- అడ్వ. సి రాబర్ట్ బ్రూస్ ని బరిలోకి దింపారు.