సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్ లో గల్లంతైన ఐదుగురి మృతదేహాలను వెలికి తీశారు. మృతులు దినేశ్వర్, జతీన్, ధనుష్ సాహిల్ లోహిత్ మృతదేహాలను బయటకు తీశారు. దాదాపు ఐదుగంటలుగా శ్రమించిన గజఈతగాళ్లు, బోట్ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను పోలీసులు గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
జనవరి 11న మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఏడుగురు యువకులు గల్లంతైన సంగతి తెలిసిందే.. స్థానికులు ఇద్దరిని రక్షించారు..మరో ఐదుగురు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. ఈత కొట్టడానికి వెళ్లి అందులో జారి పడి గల్లంతైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఐదుగురు యువకులు మృతి చెందడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.