పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి

  • పెళ్లి షాపింగ్​చేసి తిరిగొస్తుండగా యాక్సిడెంట్​
  • అదుపుతప్పి లారీని ఢీకొట్టిన కారు
  • అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ఘటన


అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి సమీపంలోని 44వ నేషనల్​హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని కొట్టింది. ఈఘటనలో ఐదుగురు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని గుత్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

కారు డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతులను అనంతపురంలోని రాణినగర్​కు చెందిన అల్లీ సాహెబ్‌ (58), షేక్‌ సురోజ్‌బాషా(28) మహ్మద్‌ అయాన్‌(6), అమాన్‌(4), రెహనాబేగం(40)గా పోలీసులు గుర్తించారు. షేక్‌ సురోజ్‌ బాషా వివాహం ఈనెల 27న జరగనునంది. పెళ్లి షాషింగ్ కోసం హైదరాబాద్‌ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.