వరంగల్ జిల్లాలోని ఎస్సార్ యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపింది. గంజాయి తాగుతూ ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. గంజాయి సేవిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం (నవంబర్ 14) యూనివర్సిటీకి వెళ్లిన నార్కోటిక్ టీమ్.. ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం హాస్టల్ గదుల్లో సోదాలు చేసి నిల్వ ఉన్న గంజాయి నార్కోటిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తాగుతూ పట్టుబడ్డ విద్యార్థులను నార్కోటిక్ బ్యూరో పోలీసులు హసన్ పర్తి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. క్యాంపస్లో విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.