US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు..ఇండియన్ ఐటీపై ప్రభావం చూపే ఐదు అంశాలు

US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు..ఇండియన్ ఐటీపై ప్రభావం చూపే ఐదు అంశాలు

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి. ట్రంప్, కమలా హారిస్ మధ్య  హోరాహోరీ పోటీ కొనసాగుతున్న క్రమంలో నెక్ టు నెక్ ఫైట్ ఫలితాలకోసం ఇండియా మార్కెట్ తో పాటు గ్లోబల్ మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. అమెరిక అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రభావం ఇండియాను ఎంత వరకు ప్రభావితం చేయనుంది.. ఇండియన్ ఇన్ ఫర్మేషన్, టెక్నాలజీ సంస్థలను ఏవిధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అభ్యర్థిపై ఇండియన్ ఐటీ కంపెనీలు భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే  ఐటీ కంపెనీల క్లయింట్లలో ఎక్కువ మంది యూఎస్ కు చెందిన వారు కావడమే దీనికి కారణం.అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే రాజకీయ, విధాన పరమైన మార్పు ఇండియన్ ఐటీ కంపెనీలపై ప్రభావం చూపుతుంది. వీసా పాలసీల నుంచి కార్పొరేట్ పన్నుల వరకు భారతీయ ఐటీ సంస్థలను ప్రభావితం చేసే అంశాలను గురించి తెలుసుకుందాం.

H-1B వీసాలపై.. 

చాలా ఐటీ కంపెనీలకు క్లయింట్ సైట్ లకు వెళ్లి పనిచేయడానికి ఉద్యోగులు అవసరం.ఆన్ సైట్ లో పనిచేసే ఉద్యోగుల కోసం అమెరికా H-1B వీసాను జారీ చేస్తుంది. అయితే ఇటువంటి అన్ సైట్ ఉద్యోగుల భవితవ్యం..H1B వీసాల జారీపై ఆధారపడి ఉంటుంది.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు H1B వీసాల జారీ గణనీయంగా తగ్గింది. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ , యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్  డేటా ప్రకారం.. ఉపాధి కోసం H1Bపిటిషన్ల తిరస్కరణ2015ఫైనాన్షియల్ ఇయర్ లో 6 శాతం ఉంటే..2018లో 24 శాతానికి పెరిగాయి.అయితే 2021లో 4శాతం గణనీయంగా తగ్గాయి. బిడెన్ అధ్యక్షతన 2021, 2022లో  H1B వీసాల తిరస్కరణ అత్యల్పంగా 2 శాతం ఉంది. 

Also Read : అమెరికా, ఇండియాల మధ్య టైం డిఫరెన్స్ ఇదే

భారతీయ ఐటీ కంపెనీలు ఇప్పుడు H-1B వీసా కోసం తిరస్కరణకు గురయ్యే అవకాశం తక్కువ. ఎందుకంటే US లోనే స్థానిక వర్క్‌ఫోర్స్‌ను నిర్మించుకున్నందున H1-B వీసాపై ఐటీ కంపెనీలు ఆధారపడటం ఇప్పుడు తగ్గిపోయింది. ఇన్ఫోసిస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ , విప్రో లిమిటెడ్ వంటి పెద్ద ఐటి ప్లేయర్‌లకు H1-B  అనుమతుల తగ్గుదల ఇందుకు నిదర్శనం. 

H-1B వీసా కార్మికులకు అధిక వేతనాలపై..

ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు H1B ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెంచాలని ప్రతిపాదించారు. అయితే అది కోర్టులో పెండింగ్ లో ఉంది..ఒకవేళ ట్రంప్ గనక అధ్యక్షుడైతే మళ్లీ ఈ ప్రతిపాదన ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తాజా డేటా ప్రకారం.. H1B వీసా ఉద్యోగుల వేతనాలు భారీగానే ఉన్నాయని తెలుస్తోంది. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ డేటా ప్రకారం 2021లో సాధారణంగా US ఉద్యోగులకంటే H-1B ఉద్యోగుల వేతనాలు 2.4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. 2003 నుంచి 2021 మధ్య, H-1B కార్మికుల సగటు వేతనం 52శాతం పెరిగింది. మొత్తం USలో 39శాతం పెరిగింది.

పన్ను రేటు ప్రభావం 

రిపబ్లికన్ ప్రభుత్వంలో పన్ను రేట్లు కార్పొరేట్లకు ప్రయోజనకరంగా  ఉంటాయని బ్రోకరేజీలు చెబుతున్నాయి. ఆర్థిక విస్తరణ విధానంలో పన్ను రేట్లు తగ్గించబడతాయని.. భారతీయ ఐటీ కంపెనీలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నాయి. 

ఫెడ్ రేట్ ప్రభావం..

ట్రంప్ అధికారంలోకి వస్తే ఫెడ్ నిర్ణయాలపై ప్రభావం పెరుగుతుందంటు JM ఫైనాన్సియల్ చెబుతోంది. ట్రంప్ ప్రతిపాదిత విధానాలు అధిక వడ్డీరేట్లకు దారి తీయొచ్చని , ప్రపంచ వృద్ధి మందగించవచ్చని అంటున్నారు. ఫలితంగా ద్రవ్యోల్బణం బాగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇది క్లయింట్ బడ్జెట్, ఐటీ ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొత్తంగా భారతీయ ఐటీ కంపెనీలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

విదేశీ కరెన్సీపై.. 

ట్రంప్ పాలనలో టారిఫ్, ఆర్థిక వృద్ధి కారణంగా డాలర్ పడుతుంది.. తద్వారా రూపాయి పరంగా భారతీయ ఐటీ కంపెనీలకు అధిక ఆదాయం వస్తుంది. అయితే హారిస్ పాలనలో డాలర్ బలహీన పడుతుందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా భారతీయ ఐటీ కంపెనీలకు తక్కువ ఆదాయం వచ్చే రావొచ్చని భావిస్తున్నారు. 

రెవెన్యూ ప్రభావం.. 

ట్రంప్ హయాంలో 2017నుంచి 20 మధ్య ఇన్ఫోసిస్ ఆదాయం CAGR 9.9 శాతంగా ఉంది. 2017 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 68 వేల 484 కోట్లుగా ఉండగా.. 2021-24 ఆర్థిక సంవత్సరంలో  బిడెన్ పాలనలో  ఇన్ఫోసిస్ ఆదాయం CAGR 15.2శాతంగా ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.1 లక్ష కోట్లు , 2024 ఆర్తిక సంవత్సరంలో రూ. 1.53 లక్షల కోట్లుగా ఉంది.