
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : విలేకర్లమంటూ డబ్బులు వసూళ్లు చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు కొత్తగూడెం వన్ టౌన్ సీఐ కరుణాకర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొంత మంది వ్యక్తులు విలేకర్లమని చెబుతూ ముఠాగా ఏర్పడి ప్రజలను డబ్బుల కోసం బెదిరిస్తున్నట్టుగా పోలీసుల దృష్టికి వచ్చిందని తెలిపారు. విచారణ చేపట్టగా లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఏలూరి రాజేశ్
కొత్తగూడెం పట్టణంలోని బర్లీఫీట్ కు చెందిన దాసరి సాంబశివరావు, చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన గుంటూరు శ్రీనివాసరావు, రుద్రంపూర్ ప్రాంతానికి చెందిన మేకల రమేశ్, కొత్తగూడెం పట్టణం మేదరబస్తీకి చెందిన బాదావత్గణేశ్ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలిందని పేర్కొన్నారు. దీంతో వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.