రాజస్థాన్​లో ఘోర ప్రమాదం..ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఐదుగురి మృతి

రాజస్థాన్​లో ఘోర ప్రమాదం..ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఐదుగురి మృతి

జైపూర్: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కును కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. మృతులంతా యూపీ లోని లక్నోకు చెందినవారు. ఖాతు శ్యామ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి వారు వెళ్తుండగా దౌసా– -మనోహర్‌‌‌‌‌‌‌‌ పూర్ జాతీయ రహదారిపై ఈ విషాదం చోటు చేసుకుంది.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఆరు నెలల చిన్నారి ఉన్నా రని పోలీసులు తెలిపారు. ప్రమాదం చాలా తీవ్రంగా జరగడంతో ట్రక్కు బోల్తా పడిందని చెప్పారు. కారు నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి తాము చాలా కష్టపడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మృతదేహాలను నిమ్స్ ఆస్పత్రి మార్చురీలో ఉంచామని, పోస్ట్ మార్టం తర్వాత వాటిని అప్పగిస్తామని వెల్లడించారు