
జగదేవపూర్, వెలుగు: గంజాయి అమ్ముతున్న ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవపూర్ గ్రామ పరిధిలోని ఏఎంఆర్ కాల్వ వద్ద గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బందితో తనిఖీలకు వెళ్లారు. అక్కడ అనుమానాస్పదంగా బైక్ పై తిరుగుతున్న ధర్మారం గ్రామానికి చెందిన జుర్రు ఆకాశ్, పీర్లపల్లి కి చెందిన బర్రెంకల శ్రీధర్, జగదేవపూర్ కు చెందిన దోమ మైపాల్, రాయవరం చెందిన నవీన్ ను అదుపులోకి తీసుకొని సోదా చేయగా వారివద్ద గంజాయి ప్యాకెట్లు దొరికాయి.
నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా మునిగడప గ్రామానికి చెందిన దేవుడి నవీన్ కుమార్ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు చెప్పారు. అనంతరం నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకొని అతడి దగ్గరి నుంచి 325 గ్రాముల గంజాయితోపాటు రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.