ఐదున్నర కిలోల..గంజాయి పట్టివేత

అల్లాదుర్గం, వెలుగు : మెదక్ జిల్లా అల్లాదుర్గం పోలీసులు మంగళవారం  ఐదున్నర కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...  ఐబీ చౌరస్తా వద్ద మంగళవారం పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా బైక్, స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు వారిని చూసి పారిపోతున్నారు. ఇది గమనించిన పోలీసులు వెంబడించి ఒకరిని పట్టుకున్నారు. 

Also Read : టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి: అనుముల సురేశ్

మరొకరు పారిపోయాడు. పట్టుబడిన రేగోడు మండలం పెద్దతండవాసి సోమ్లా నాయక్ వద్ద ఐదున్నర కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వ్యక్తి అదే తండాకు చెందిన వడితే వసంత్ గా గుర్తించారు.  కేసు నమోదు దర్యాప్తులో ఉంది.