
లాసానె: ప్రతిష్టాత్మక ఫిడే వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఇండియా నంబర్ వన్ ఎరిగైసి అర్జున్‌తో పాటు ఐదుగురు ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. ఈ నెల 26 నుంచి 31 వరకు జరిగే ఈ టోర్నీ ఓపెన్ సెక్షన్‌లో అర్జున్, ప్రజ్ఞానంద విమెన్స్‌లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్. వైశాలి పాల్గొంటారని ఫిడే సోమవారం ప్రకటించింది.
దాదాపు రూ.12 కోట్ల ప్రైజ్‌మనీ లభించే ఈ ఈవెంట్‌లో మాగ్నస్ కార్ల్‌సన్, ఫాబియానో కరువానా, వెస్లీ సో సహా 300 మంది వరల్డ్ బెస్ట్ ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారని తెలిపింది.