Terrorist Attack: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జనాలపైకి గ్రెనేడ్లు

Terrorist Attack: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జనాలపైకి గ్రెనేడ్లు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌ నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే ఫ్లీ మార్కెట్‌లో ఆదివారం(నవంబర్ 3) గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అత్యంత భద్రత ఉండే టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ (TRC) సమీపంలోనే ఈ దాడి జరిగింది. 

సమాచారం అందిన వెంటనే భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా దళాల చేతిలో లష్కరే తోయిబా (LeT) టాప్ పాకిస్తానీ కమాండర్‌ హతమైన మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.