ఐపీఎల్ 2024 వేలం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే 10 జట్లలో చాలా మంది ఆటగాళ్లను రిలీజ్ చేయడం.. ఈ సారి స్టార్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడుతుండడంతో వేలంలో ఎవరికి ఎక్కువ ధర పలుకుతుందో తెలుసుకోవడానికి అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ 2024 వేలం కోసం ఆటగాళ్లు తమ పేరు నమోదు చేసుకోవడానికి గురువారం (నవంబర్ 30) చివరి తేదీ. ఐపీఎల్లో పాల్గొనాలంటే ముందు ఐపీఎల్ వేలం కోసం ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతేకాకుండా వారి వారి బోర్డుల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ని కూడా సమర్పించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో వేలానికి ఎవరు అందుబాటులో ఉంటారో నేడు తెలిసిపోనుంది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఆసక్తికర విషయం ఒకటి బయటికి వచ్చింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఈ సారి హై డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ను ఏకంగా 5గురు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు సంప్రదించినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా సన్నిహిత వర్గాలు వార్తా సంస్థకు తెలిపాయి. స్టార్క్ ఐపీఎల్ లో ఆడితే భారీ ధర పలకడం ఖాయంగా కనిపిస్తుంది. 2015 లో చివరిసారి బెంగళూరు తరపున ఆడిన స్టార్క్..ఆ తర్వాత ఐపీఎల్ కంటే దేశానికీ ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి ఐపీఎల్ లో పాల్గొనలేదు. అయితే 2024 లో టీ 20 వరల్డ్ కప్ ఉండడంతో స్టార్క్ ఈ ఐపీఎల్ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
స్టార్క్ 2024 ఐపీఎల్ వేలానికి అందుబాటులో ఉంటే బెంగుళూరు, చెన్నై, ముంబై, పంజాబ్, ఢిల్లీ జట్లు అతన్ని కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్టార్క్ తో పాటు కొయెట్జ్, కమ్మిన్స్, హెడ్, రచీన్ రవీంద్రకు భారీ ధర పలుకుతుందని అందరూ భావిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. వేలం కోసం 700 మందికి పైగా ఆటగాళ్లు తన పేర్లు నమోదు చేసుకోనున్నారు. మరి ఐపీఎల్ 2024కు ఎవరు ఎక్కువ ధర పలుకుతారో చూడాలి.
At least 5 IPL franchises have reached out to Mitchell Starc to know about the availability during the 2024 season. [Cricbuzz] pic.twitter.com/uaOxBixBxg
— Johns. (@CricCrazyJohns) November 29, 2023