ఐదుగురు ఐపీఎస్‌‌‌‌ల బదిలీ.. సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు

ఐదుగురు ఐపీఎస్‌‌‌‌ల బదిలీ.. సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని కీలక విభాగాల్లో ఐదుగురు ఐపీఎస్‌‌‌‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్‌‌‌‌లో ఉన్న అడిషనల్  డీజీ సౌమ్యా మిశ్రా(1994) కు ఏడీజీ (పర్సనల్‌‌‌‌) పోస్టింగ్‌‌‌‌  ఇచ్చారు. ఐజీ కమలాసన్‌‌‌‌ రెడ్డి (2004) ని డ్రగ్‌‌‌‌  కంట్రోల్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌గా, సిటీ అడిషనల్  సీపీ, క్రైమ్స్‌‌‌‌ ఏఆర్‌‌‌‌‌‌‌‌  శ్రీనివాస్‌‌‌‌ (2004) ను ఏసీబీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా బదిలీ చేశారు. డీఐజీ అంబర్  కిశోర్  ఝా (2009) ను  హోంగార్డ్స్‌‌‌‌  అండ్‌‌‌‌  టెక్నికల్  సర్వీసెస్‌‌‌‌లో  పోస్టింగ్ ఇచ్చారు. సిటీ సీసీఎస్‌‌‌‌  డీసీపీ శభరీశ్  (2017) ను మేడ్చల్  డీసీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.