ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా జరుగుతుంది. సాధువులు.. సన్యాసులతో పాటు భక్తులు చాలా భక్తులు హాజరవుతారు. ఏ దేవాలయానికి వెళ్లినా..పుణ్య క్షేత్రానికి వెళ్లినా అక్కడి నుంచి ఏదో ఒకటి తెచ్చుకుంటాం.. అయితే కుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడి నుంచి తప్పని సరిగా ఐదు వస్తువులను తెచ్చుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
కుంభమేళాకు ప్రయాగ్ రాజ్ వెళ్లిన వారు త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడ ఉన్న దేవాలయాలను సందర్శించి ఐదు వస్తువులను ఇంటికి జాగ్రత్తగా తెచ్చుకోవాలని పురాణాల ద్వారా తెలుస్తుంది.
.
రుద్రాక్ష మాల: కుంభమేళా జరిగే ప్రదేశంలో లభించే రుద్రాక్షమాలను ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే హిందువులు రుద్రాక్ష మాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. రుద్రాక్ష చాలా పవిత్రమైనది. అయితే మాలను గంగానది నీళ్లతో తడపండి. జపం.. అనుష్ఠానం చేసేటప్పుడు దీనినే ఉపయోగిస్తారు. చాలామంది దీనిని మెడలో ధరిస్తారు. ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. రుద్రాక్ష మాల ధరిస్తే, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
మట్టి : కుంభమేళా ప్రయాగ్ రాజ్ లో గంగానది ఒడ్డును జరుగుతుంది. ఈ పవిత్రమైన మట్టిని తెచ్చుకోండి. సాధారణంగా హిందువుల ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది. ఈ మట్టిని ఎర్రటి గుడ్డలోకాని.. ఎర్రటి సంచిలో కాని తెచ్చుకోండి. తులసి మొక్క మట్టిలో .. ఈ మట్టిని కలపండి. ఈ మట్టిని ఇంటిలో పూజా మందిరంలో కూడా ఉంచుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
శివలింగం: కుంభమేళా నుంచి తిరిగి వచ్చేటప్పుడు చిన్నపాటి శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోండి. దీనిని పూజా మందిరంలో ఉంచుకోండి. దీనితో పాటు పూజా సామాగ్రిని.. ఆధ్యాత్మిక గ్రంథాలను తెచ్చుకోండి. అయితే మీ బడ్జెట్ కు మించకుండా చూసుకోండి.
తులసి ఆకులు: కుంభమేళాకు వెళ్లిన వారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తారు. తరువాత అక్కడికి దగ్గరలో ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లండి. ఆ దేవాలయం పూజారులు మీకు పూజ చేసిన తులసి ఆకులు ఇస్తారు. వీటిని ఎర్రటి వస్త్రంలో కట్టి.. డబ్బులు పెట్టుకునే స్థలంలో కాని.. బీరువాలో కాని పెట్టుకోండి. ఇలా చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.
పవిత్ర నదుల జలం : త్రివేణి సంగమం అంటే అక్కడ పవిత్ర జలాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అక్కడి జలాన్ని ఓ బాటిల్ లో తెచ్చుకోండి. వీటిని ఇంటి చుట్టే చల్లితే.. ఇంట్లో శాంతి, శ్రేయస్సు వస్తాయి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి ఆ జలాల శక్తికి వెంటనే వెళ్లిపోతుంది.