
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ భాగయత్ లో ఎండు గంజాయి అమ్ముతున్న వ్యక్తిని ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. అల్వాల్, వెంకటాపురానికి చెందిన అభిషేక్ కుమార్ సింగ్ బైక్పై 5.147 కిలోల ఎండు గంజాయిని రవాణ చేస్తుండటంతో సమాచారం అందింది. దీంతో పోలీసులు అతన్ని పట్టుకొని విచారించారు. ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ నుంచి ఎండు గంజాయిని తెచ్చి, సిటీలో ఎక్కువ ధరకు అమ్ముతున్నాడని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బి.ఓంకార్ తెలిపారు.