అఫ్గాన్​లో ఆత్మాహుతి దాడి..ఐదుగురు మృతి

అఫ్గాన్​లో ఆత్మాహుతి దాడి..ఐదుగురు మృతి

ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్​లో ఓ బ్యాంకు సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. సూసైడ్ బాంబర్ తనకు తాను పేల్చుకోవడంతో ఐదుగురు చనిపోయారు. ఏడుగురికి గాయాలయ్యాయి. 

మంగళవారం కుందుజ్ ఫ్రావిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కాబూల్ బ్రాంచ్​ సమీపంలో ఈ దాడి జరిగిందని పోలీసుల అధికార ప్రతినిధి జుమావుద్దీన్ ఖక్సర్ తెలిపారు. చనిపోయిన వారిలో బ్యాంకు గార్డు కూడా ఉన్నారు. ఈ దాడికి ఎవరు బాధ్యత వహించలేదని ఖక్సర్ చెప్పారు. 

దాడికి పాల్పడిన వారి ఆచూకీని కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అఫ్గాన్​లో 2021, ఆగస్టులో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలోనే అమెరికా, నాటో దళాలు ఆ దేశం నుంచి వైదొలిగాయి. అప్పటి నుంచి అఫ్గానిస్తాన్​లో ఆత్మాహుతి దాడులు అరుదుగా మారాయి.