పిడుగుపాటుకు ఒకే ఇంట్లోని ఐదుగురు చనిపోయిన ఘటన అస్సాంలో జరిగింది. కరీమ్గంజ్ జిల్లాలోని ఇషాఖౌరి గ్రామంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి పిడుగులు కూడా పడ్డాయి. గ్రామానికి చెందిన ఇస్లాముద్దీన్ తన పిల్లలతో ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఇంటిపై పిడుగు పడటంతో ఇంట్లోని నలుగురు పిల్లలతో సహా ఆయన కూడా మరణించాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిని 50 ఏళ్ల ఇస్లాం ఉద్దీన్, 12 ఏళ్ల అన్వర్ హుస్సేన్, 12 ఏళ్ల షరీఫుద్దీన్, 10 ఏళ్ల దిల్వర్ హుస్సేన్, 9 ఏళ్ల అబిదా బేగంగా గుర్తించారు. గాయపడిని వారిని చికిత్స నిమిత్తం కరీంగంజ్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఇషాఖౌరి గ్రామం రతబరి నియోజకవర్గ పరిధిలో ఉండటంతో.. ఆ ప్రాంత ఎమ్మెల్యే బిజోయ్ మల్కర్ ఘటనా స్ఠలాన్ని పరిశీలించారు. రామకృష్ణ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఇషాఖౌరి గ్రామంలోని ఒక కుటుంబం ఇంట్లో ఉండగా.. వారి ఇంటి మీద పిడుగు పడిందని.. ఆ ఘటనలో అయిదుగురు చనిపోయారని కరీమ్గంజ్ సూపరింటెండెంట్ పోలీస్ సంజిత్ కృష్ణ తెలిపారు.
పిడుగుపడి అయిదుగురు మృతి.. అందులో నలుగురు పిల్లలే
- దేశం
- June 13, 2020
లేటెస్ట్
- తెలంగాణది ఓదారి, ఆ ఇద్దరు నేతలది ఇంకో దారి
- రేవంత్ పాలనపై ప్రజా తిరుగుబాటు : ఎమ్మెల్యే హరీశ్‌రావు
- కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్‌కు మంచి రోజులు
- పదేండ్లుగా దిశా మీటింగులు పెట్టరా : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- చేతితోనే తేమ చెకింగ్ .. ఖమ్మం మార్కెట్లో ట్రేడర్ల మాయాజాలం
- వాట్సాప్ పై నిషేధానికి నో..పిల్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- బైడెన్‌తో ట్రంప్ భేటీ
- స్టూడెంట్లతో సీఎం మాక్ అసెంబ్లీ
- సమ సమాజ మార్గదర్శి గురునానక్
- ఢిల్లీ మేయర్‌గా మహేశ్ ఖించీ
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- Ranji Trophy 2024-25: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన షమీ
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?