ఐదుగురు మావోయిస్టులు, కాంగ్రెస్​ లీడర్​ అరెస్ట్​

హనుమకొండ, వెలుగు: ఛత్తీస్ గఢ్ ​ రాష్ట్రంలోని బీజాపూర్​ నుంచి వరంగల్ కు​ వచ్చిన నలుగురు మావోయిస్టులు, వారికి సహకరించిన కాంగ్రెస్​ నేతను పోలీసులు అరెస్ట్​ చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నలుగురు మావోయిస్టులు బీజాపూర్​ నుంచి భూపాలపట్నం బ్లాక్​ కాంగ్రెస్​ నాయకుడు కే.జీ.సత్యం సహాయంతో ఆదివారం ఉదయం వరంగల్ నగరానికి వచ్చారు.

నగరంలోని ప్రైవేటు హాస్పిటల్ ​కు వెళుతుండగా హనుమకొండ పోలీసులకు సమాచారం అందింది. వెహికల్ చెకింగ్ ​చేపట్టిన పోలీసులు కాంగ్రెస్​ నేతతో పాటు నలుగురు మావోయిస్టులను  అదుపులోకి తీసుకున్నారు. ఇందులో బస్తర్​ ఏరియా మహిళా కమాండర్, మరో మహిళా సభ్యురాలు, ఇద్దరు దళసభ్యులు ఉన్నట్లు సమాచారం.