ఎమ్మెల్సీలకు ధ్రువీకరణ పత్రాలు అందజేత

ఎమ్మెల్సీలకు ధ్రువీకరణ పత్రాలు అందజేత
  • ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఐదుగురు ఏకగ్రీవమయ్యారు. గురువారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడం, ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలవడంతో కాంగ్రెస్ తరఫున విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ తరఫున నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ తరఫున దాసోజు శ్రవణ్‌‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం అసెంబ్లీలోని సెక్రటరీ 
కార్యాలయంలో కార్యదర్శి నర్సింహా చారి నుంచి వీరు ధ్రువీకరణ పత్రాలుఅందుకున్నారు.