Elon Musk: నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్..రచయిత సంచలన కామెంట్స్.. వైరల్

Elon Musk: నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్..రచయిత సంచలన కామెంట్స్.. వైరల్

ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ పై ప్రముఖ రచయిత సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల తనకు జన్మించిన బిడ్డకు ఎలాన్ మస్కే తండ్రి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది.. 

ప్రముఖ రచయిత అయిన 31ఏళ్ల యాష్లే సెయింట్ క్లైర్.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ద్వారా ఇటీవల తాను ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు సంచలన విషయాన్ని వెల్లడించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ పోస్ట్ చేసింది. తన ఐదు నెలల బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్ అని చెప్పింది. ఇంతకాలం సెక్యూరిటీపరమైన  ఇబ్బందులతో ఈ విషయం వెల్లడించలేదని తెలిపింది. 

‘‘ఐదు నెలల క్రితం నేను ఈ ప్రపంచంలోకి నా బిడ్డను స్వాగతించారు. ఆ బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి’’ అంటూ X లో పోస్ట్ చేసింది. ‘‘మాపిల్లల ప్రైవసీ, సెక్యూరిటీ కారణంగా ఈ విషయాన్ని వెల్లడించలేదు.. ఇటీవల మీడియాలో ఈ వార్తలు వస్తుండటంతో అలా చేశానని’’ చెప్పుకొచ్చింది. 

Also Read : అమెరికాలో భారీగా ఉద్యోగుల తొలగింపు

‘‘మా బిడ్డ అందరిలాగే సాధారణంగా ,సురక్షితమైన వాతావరణంలో ఎదగాలని నేను భావిస్తున్నాను. మీడియా మా పిల్లల ప్రైవసీని గౌరవించాలని, ఇన్వాసివ్ రిపోర్టింగ్ కు దూరంగా ఉండాలని కోరుతున్నాను ’’ అని ఓ నోట్ షేర్ చేసింది.

అయితే సెయింట్ క్లెయిర్ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ విషయం అతని లాయర్ కు మాత్రం చేరిందని ఎలాన్ మస్క్ వర్గాలు చెబుతున్నాయి.

ఎలాన్ మస్క్ కు ఇప్పటికే ముగ్గురు భార్యలు,12 మంది పిల్లలు ఉన్నారు. 13వ పిల్లాడి రహస్యాన్ని క్లెయిర్ బయటపెట్టిందని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ అమెరికాలో పర్యటన సందర్భంగా మోదీని కలిశారు ఎలాన్ మస్క్.. ఆ సందర్భంలో కూడా తన ముగ్గురు పిల్లలతో సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.