న్యూఢిల్లీ: ఐదు కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ కిందటి వారం రూ.1.13 లక్షల కోట్లు పెరిగింది. ఎయిర్‌టెల్ షేర్లు 5 శాతం పెరగడంతో ఈ కంపెనీ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.9.50 లక్షల కోట్లను దాటింది. టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు కూడా మెరిశాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, ఐటీసీ, హిందుస్తాన్ యూనిలీవర్‌ల మార్కెట్ క్యాప్ మాత్రం తగ్గింది.
కిందటి వారం ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.48 వేల కోట్లు పెరిగి రూ.9.57 లక్షల కోట్లకు, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.32 వేల కోట్లు పెరిగి రూ.8.30 లక్షల కోట్లకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 12 వేల కోట్లు పెరిగి రూ.14.3 లక్షల కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.12 వేల కోట్లు పెరిగి రూ.9.49 లక్షల కోట్లను టచ్ చేయగా, టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.10 వేల కోట్లు ఎగిసి రూ.16.18 లక్షల కోట్లకు పెరిగింది. అతిపెద్ద కంపెనీ రిలయన్స్ మార్కెట్ క్యాప్ మాత్రం రూ.52 వేల కోట్లు తగ్గి రూ.17.23 లక్షల కోట్లకు దిగొచ్చింది.