రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ సంఘటన జరిగింది. సారన్‌గఢ్-బిలాయ్‌గఢ్ జిల్లాలో మే 18వ తేదీ శనివారం ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులను నరికి చంపగా, మరొక వ్యక్తి ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. రాయ్‌పూర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని సలిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని థర్గావ్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పుష్కర్ శర్మ చెప్పారు.
మృతి చెందిన వారిని హేమ్‌లాల్ సాహు(55), అతని భార్య జగ్మోతి సాహు (50), వారి కుమార్తెలు మీరా సాహు (30), మమతా సాహు (35), మనవడు ఆయుష్ (5)గా గుర్తించారు. అదే గ్రామానికి చెందిన మనోజ్ సాహు ఇంటి ఆవరణలో ఉరి వేసుకుని కనిపించినట్లు ఎస్పీ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు.
ఐదుగురు కుటుంబ సభ్యులకు గొడ్డలి గాయాలయ్యాయని.. మనోజ్ ఉరివేసుకునే ముందు వారిని హత్య చేసినట్లు ప్రాథమి దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించిందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ పుష్కర్ శర్మ వెల్లడించారు.