ఏనుగుల దాడి.. ఐదుగురు భక్తులు మృతి

ఏనుగుల దాడి.. ఐదుగురు భక్తులు మృతి

ఆంద్రప్రదేశ్  అన్నమయ్య జిల్లాల్లో దారుణం జరిగింది. ఓబులవారి పాలెం మండలం గుండాల కోన దగ్గర దర్శనానికి వెళ్లిన భక్తులను ఏనుగులు తొక్కి చంపాయి.  శివరాత్రి సందర్భంగా దర్శనానికి వెళ్తున్న భక్తుల గుంపుపై ఒక్కసారిగా ఏనుగులు దాడి చేశాయి.  ఈ ఘటనలో  ఐదుగురు భక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరి కొందరికిగాయాలయ్యాయి.  

స్థానికుల సమాచారంతో గుండాల కోనకు వచ్చిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు సహాయక చర్యల చేపట్టారు. గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.