ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ మండలం మన్నుర్ దగ్గర ట్రాక్టర్‌ను వ్యాను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే చనిపోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం నుంచి ఆదిలాబాద్‌కి టమాటా లోడ్‌తో వెళ్తున్న వ్యాను.. ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యానులో ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు.. ట్రాక్టర్ డ్రైవర్ కూడా మృతి చెందాడు. గాయపడిన మరో వ్యక్తిని చికిత్స కోసం స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.
అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యుకులు చనిపోయారు. మృతులు మహారాష్ట్రలోని నాందెండ్ జిల్లాకు చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు. వీరు జగిత్యాల జిల్లా కలికోటలో నివాసం ఉంటున్నారని తెలిపారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.