- హైదరాబాద్ మేడ్చల్‌లో బైక్‌ను ఢీకొట్టిన లారీ
- భార్యాభర్తలతో పాటు కూతురు మృతి, కొడుకు పరిస్థితి విషమం
- నాగర్‌కర్నూల్ జిల్లాలో లారీ, కారు ఢీ.. ఇద్దరు మృతి
మేడ్చల్, వెలుగు : బైక్‌ను కంటెయినర్ లారీ ఢీకొట్టడంతో భార్యాభర్తలతో పాటు కూతురు చనిపోగా, కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం హైదరాబాద్‌లోని మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని కాకినాడ ప్రాంతానికి చెందిన సాగి బుల్లబ్బాయి (37) ఫ్యామిలీతో కలిసి ఉప్పల్‌లో ఉంటూ టిఫిన్ బండి నడిపిస్తున్నాడు. ఆదివారం భార్య లావణ్య (30), కూతురు హర్షిత దేవి (10), కొడుకు సిద్దేశ్వర్‌తో కలిసి బైక్‌పై మేడ్చల్ మండలం ఎల్లంపేటలో ఉంటున్న బంధువుల ఇంటికి బయలుదేరాడు. మేడ్చల్ సమీపంలోకి రాగానే నాగాలాండ్‌కు చెందిన కంటైయినర్ లారీ వెనుక నుంచి వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బుల్లబ్బాయి, లావణ్య, హర్షిత దేవి అక్కడికక్కడే చనిపోయారు. సిద్దేశ్వర్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బాలుడిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం జరగగానే లారీని అక్కడే వదిలి డ్రైవర్ పరార్ అయ్యాడు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో..
వంగూరు, వెలుగు : సిమెంట్ మిక్చర్ లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదం నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల పరిధిలోని జూపల్లి గ్రామ సమీపంలో జడ్చర్ల – కోదాడ హైవేపై ఆదివారం రాత్రి జరిగింది. వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన గణేశ్, కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన రమేశ్ కారులో వెళ్తున్నారు. జూపల్లి గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో దానిని ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.