ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా .. జయశంకర్ ​భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ లో ​కలకలం

  • వృద్ధురాలి పరిస్థితి విషమం 
  • మరో నలుగురికి ఇంట్లోనే చికిత్స

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన 65 ఏండ్ల సుంకర యాదమ్మకు మూడు రోజులు క్రితం కరోనా వచ్చింది. తాజాగా ఆమె కుటుంబసభ్యులు భాస్కర్, వీణ.. వీరి పిల్లలు ఆకాశ్​, మిద్దిలకు కూడా కరోనా సోకినట్లు తేలింది. దీంతో వారంతా డాక్టర్ల సలహా మేరకు ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్నారు. 

ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.  అయితే, యాదమ్మ పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చేర్పించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా పెట్టుకొని, సామాజిక దూరం పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.