అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో కలకలం.. ఇనుప రాడ్డుతో భక్తులపై దుండగుడి దాడి

అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో కలకలం.. ఇనుప రాడ్డుతో భక్తులపై దుండగుడి దాడి

అమృత్సర్: పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయంలో శుక్రవారం ఒక గుర్తు తెలియని దుండగుడు భక్తులపై దాడికి పాల్పడ్డాడు. ఇనుప రాడ్ తో దాడికి పాల్పడటంతో ఐదుగురు భక్తులకు గాయాలయ్యాయి. వీరిలో ఒక సిక్కు యువకుడి పరిస్థితి సీరియస్గా ఉంది. వాల్లాలోని శ్రీ గురు రామ్ దాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనెన్స్ లో సదరు యువకుడికి వైద్యులు చికిత్సనందిస్తున్నారు.

గాయపడిన వారిలో ఇద్దరు ఆలయంలో వాలంటీర్లు కాగా, ముగ్గురు భక్తులు మొహాలీ, బతీండ, పాటియాలా ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడితో పాటు మరో వ్యక్తి కూడా ఈ దాడికి కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ALSO READ | హనీట్రాప్ లో పడి.. పాకిస్తాన్కు రహస్య సమాచారం లీక్.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి అరెస్ట్..

నిందితుడు దాడి చేయడం కంటే ముందు అతనితో పాటు ఉన్న వ్యక్తి ఆలయంలో రెక్కీ చేసినట్లు తెలిసింది. భక్తులపై దాడికి పాల్పడిన నిందితుడిని హర్యానాకు చెందిన జుల్ఫాన్ అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో నిందితుడికి కూడా గాయాలైనట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడి వెనుక నిందితుడి ఉద్దేశం ఏంటనే విషయంపై విచారణ జరుపుతున్నామని, భక్తులు ఎలాంటి భయాందోళన చెందవద్దని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో భక్తుల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి.