మిర్యాలగూడ వద్ద ఘోర ప్రమాదం ఐదుగురు మృతి

మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి నార్కట్ పల్లి-అద్దంకి హైవేపై కృష్ణానగర్ కాలనీ వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్​లోనే చనిపోయారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. చనిపోయినోళ్లలో చెరుపల్లి మహేశ్, ఆయన భార్య జ్యోతి, వాళ్ల ఇద్దరు పిల్లలు రిషిత, రియాన్షి, మరోవ్యక్తి మశ్చేంద్ర​ ఉన్నారని పోలీసులు తెలిపారు. మశ్చేంద్ర​ భార్య మాధవికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని మిర్యాలగూడ పట్టణంలోని  నందిపహాడ్​కు చెందిన వారుగా గుర్తించారు. విజయవాడ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుతారనగా ఈ ఘోరం జరిగింది.