పెనుబల్లి, వెలుగు : పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో వీఎం బంజరు ఎస్ఐ వెంకటేశ్ ఆదివారం సాయంత్రం సిబ్బందితో స్థావరం పై దాడి చేశారు. ఈ దాడి లో కుప్పెనకుంట్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న
ఓ టీచర్‌తో తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 21,050 , రెండు బైక్ లు,పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరి పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.