
కరీంనగర్‌క్రైం, వెలుగు: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ కరీంనగర్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ సరళరేఖ తీర్పు ఇచ్చారు. మద్యం తాగిన వారిని మంగళవారం ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రమేశ్ కోర్టులో హాజరు పరిచారు.
కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామానికి చెందిన అయిన మలోత్ రాజుకు ఐదు రోజుల జైలు శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించారు. మిగితా నలుగురికి కలిపి రూ.9,500 జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు.
ALSO READ :ఆవుతో లింకేంటీ.. మళ్లీ ఆవును ఢీకొన్న వందే భారత్ రైలు