ఐపీఎల్ 2025 కు సంబంధించి రిటైన్ చేసుకునే ప్లేయర్ల సమయం దగ్గర పడుతుంది. మరో మూడు రోజుల్లో ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకునే ఆటగాళ్లను ప్రకటించాల్సి ఉంది. అక్టోబర్ 31 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే చివరి తేదీ. 2025 ఐపీఎల్ కోసం మెగా ఆక్షన్ జరగనుండడంతో ఎవర్ని రిటైన్ చేసుకోవాలో అనే విషయంపై భారీ హైప్ నెలకొంది. తాజాగా లక్నో సూపర్ జయింట్స్ జట్టు రిటైన్ చేసుకునే ప్లేయర్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది.
మూడేళ్ళుగా లక్నో జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ పై లక్నో యాజమాన్యం ఆసక్తి చూపించలేదు. దీంతో అతను మెగా ఆక్షన్ లోకి రావడం దాదాపుగా ఖాయమైంది. రాహుల్ విషయంలో లక్నో అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. అతని స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉండడమే దీనికి కారణం. లక్నో రిటైన్ ప్లేయర్ల విషయానికి వస్తే నికోలస్ పూరన్ టాప్ లో ఉన్నాడు. అతనికి రూ. 18 కోట్లు ఇచ్చి మొదటి రిటైన్ ప్లేయర్ గా తీసుకోనున్నారు. పూరన్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్ లో చెలరేగి ఆడుతున్నాడు.
ALSO READ | AUS vs PAK 2024: పాకిస్థాన్‌తో టీ20 సిరీస్.. కెప్టెన్ లేకుండానే ఆసీస్ జట్టు ప్రకటన
లీగ్ ఏదైనా విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఐపీఎల్ లో కూడా ఇంటి చేత్తో మ్యాచ్ లు గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. కెప్టెన్సీ కూడా పూరన్ కు ఇవ్వనున్నట్టు సమాచారం. 2024 ఐపీఎల్ లో రాహుల్ గైర్హాజరీలో ఈ విండీస్ బ్యాటర్ కొన్ని మ్యాచ్ లకు కెప్టెన్సీ చేశాడు. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ తో పాటు రవి బిష్ణోయ్ లు తర్వాత రిటైన్ ప్లేయర్ల లిస్టులో ఉన్నారు. వీరిద్దరితో పాటు మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోనీలను అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా రిటైన్ చేసుకోనుంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినీస్ కు నిరాశ తప్పలేదు.
THE LIKELY RETENTIONS OF LUCKNOW SUPER GIANTS. [Espn Cricinfo]
— Johns. (@CricCrazyJohns) October 28, 2024
1) Nicholas Pooran
2) Mayank Yadav
3) Ravi Bishnoi
4) Ayush Badoni
5) Mohsin Khan pic.twitter.com/st3GCyKcHS