రజనీకాంత్ Vs అమితాబ్ బచ్చన్.. న్యాయం చేయడంలో ఎవరి వెర్షన్ కరెక్ట్!

రజనీకాంత్ Vs అమితాబ్ బచ్చన్.. న్యాయం చేయడంలో ఎవరి వెర్షన్ కరెక్ట్!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా ‘వేట్టయన్‌‌‌‌ – ది హంటర్’.  టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.  బుధవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ‘ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు.. ఇలాంటి మగ మృగాలను ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో చంపేయాలి అంటూ స్టూడెంట్స్‌‌‌‌ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్‌‌‌‌తో ట్రైలర్‌‌‌‌‌‌‌‌ మొదలైంది.

ఓ వారంలో ఎన్‌‌‌‌కౌంటర్ జరిగిపోవాలని పోలీస్‌‌‌‌ బాస్‌‌‌‌ల హెచ్చరికలతో పరిస్థితి తీవ్రత ఎలా ఉందో చూపించారు.  ‘వారం రోజులు అక్కర్లేదు..  మూడే రోజుల్లో డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు మంచి పేరు వస్తుంది’ అంటూ ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌ స్పెషలిస్ట్‌‌‌‌గా రజినీకాంత్ రంగంలోకి దిగాడు.

‘న్యాయం అన్యాయం అయినప్పుడు న్యాయంతోనే సరిజేయాలి.. అంతేకానీ ఇంకో అన్యాయంతో కాదు’ అని ఎన్‌‌‌‌కౌంటర్స్‌‌‌‌ను వ్యతిరేకించే ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా అమితాబ్‌‌‌‌ బచ్చన్ కనిపించారు. ‘క్రైమ్ క్యాన్సర్ లాంటిదని, దాన్ని పెరగనివ్వకుండా, అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసులు అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పేమీ కాదు’ అంటాడు వేట్టయన్.

ఇద్దరిలో ఎవరి వెర్షన్ కరెక్ట్ అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్‌‌‌‌ అని అర్థమవుతోంది. రజినీకాంత్ నుంచి ఆశించే మాస్,  యాక్షన్ ఎలిమెంట్స్‌‌‌‌ ఉంటూనే, సోషల్ ఇష్యూని టచ్ చేసినట్టు తెలుస్తోంది. అక్టోబ‌‌‌‌ర్ 10న సినిమా విడుదల కానుంది. 

పోలీస్ డిపార్ట్‌మెంట్ లోని రజనీకాంత్, అడ్వొకేట్ అయిన అమితాబ్ బచ్చన్ మధ్య హోరాహోరీగా సాగిన ఫైట్ ను ఈ ట్రైలర్ లో చూడొచ్చు. బిజినెస్‌‌‌‌ మ్యాన్‌‌‌‌ గెటప్‌‌‌‌లో రానా,  ఇతర ముఖ్యపాత్రల్లో ఫహద్ ఫాజిల్, రితికా సింగ్‌‌‌‌, దుషారా విజ‌‌‌‌య‌‌‌‌న్, రోహిణి, అభిరామి కనిపించారు.అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఈ ట్రైలర్ కు పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది.

  • Beta
Beta feature