నువ్వుల లడ్డూ ఇది తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు..ఎల్లుండ, తిలు లడ్డు, అలసిసేమ్ అని పిలువబడే తెల్లనువ్వుల లడ్డూ గురించి తెలియనివారుండరు..మన దేశంలో ఈ లడ్డూలు ఫేమస్.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.. పూర్వం నుంచి ఈ లడ్డూలను తిరుతిండిగా మనవాళ్లు తింటున్నారు. నేటీకి వీటిని స్నాక్స్ గా పిల్లలు, పెద్దలు తింటుంటారు..ఇవి చిరుతిండి గానే కాకుండా..మన శరీరంలోని అన్ని భాగాల పనితీరును మెరుగుపర్చే బలవర్థకమైన ఆహారంగా కూడా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. నువ్వుల లడ్డూతో కలిగే ఐదు రకాల ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
వృద్ధాప్యం ఛాయలు తగ్గించుకోవచ్చు..
తెల్ల నువ్వుల లడ్డూ.. ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇవి శరీర కణాలను ప్రొడ్యూస్ చేయడాన్ని ప్రోత్సహిస్తాయి. దీంతో వృద్ధాప్య ఛాయలు దగ్గరు చేరవు. రోజుకు ఒక లడ్డూ చొప్పున తింటుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. మీ జీర్ణక్రియకు సహాయ పడేందుకు వెచ్చని హెర్బల్ టీతో తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
జుట్టు ఆరోగ్యం కోసం..
నువ్వుల లడ్డూను.. తెల్ల నువ్వులతో తయారు చేస్తారు కదా.. నువ్వుల్లో ఆరోగ్యకరమైన బలమైన, మెరుస్తున్న జుట్టుకు కావాల్సిన కాల్షియం, జింక్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు హెయిర్ ఫోలికల్స్ కు పోషణ, తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. ఇక లడ్డూ తయారీలో ఉపయోగించే బెల్లం వంటి పదార్ధాలు హార్మోన్ల బ్యాలెన్సింగ్ ను మెరుగుపరుస్తాయి. తద్వారా ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
ALSO READ : తేనెటీగ విషంతో గంటలో క్యాన్సర్ ఖతం !
మూడ్ ను మార్చేస్తుంది..
టిల్ లడ్డూలో బెల్లం ఉంటుంది.. ఇది సహజ చక్కెరల శక్తి స్థాయిలను స్థిరీకరంచడం, మానసిక స్థితి మెరుగుపర్చడంలో ఎంతో సహాయపడుతుంది. ఒత్తిడితో ఉన్న సమయాల్లో టిల్ లడ్డూను తింటే మూడ్ మారిపోతుంది.. రిలాక్స్ అవుతారు. దీనిలో ఉంటే పీచు పదార్థం జీర్ణ క్రియకు ఎంతో సహకారిగా ఉంటుంది.
జీవక్రియకు బెస్ట్ బూస్టింగ్..
నువ్వుల లడ్డూలో ఉంటే నువ్వులు, బెల్లం వంటి పదార్థాలు జీవక్రియ ఆరోగ్యానికి తోడ్పడతాయి. మనం తినే ఆహారాన్ని సమర్థవంతంగా ప్రాసెస్ చేయడంలో సహాయపడతాయి. దీంతో పాటు బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఓ మంచి ఫుడ్.
సో..రోజుకో నువ్వుల లడ్డూను మితంగా తినండి ఆరోగ్యంగా ఉండండి.