రామజన్మ భూమి వర్క్అవుట్ కాలే: అయోధ్యలో BJP ఓడిపోవడానికి ఈ ఐదు కారణాలే

రామజన్మ భూమి వర్క్అవుట్ కాలే: అయోధ్యలో BJP ఓడిపోవడానికి ఈ ఐదు కారణాలే

సరిగ్గా ఆరు నెలల క్రితం దేశమంతా రామజన్మ భూమి చర్చ.. అయోధ్యలో రామమందిర నిర్మాణం అది చాలామంది ఎన్నో ఏళ్ల కాల.. హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ విషయం దేశవ్యాప్తంగా లోక్ సభ 2024 ఎన్నికల్లో బీజేపీకి మంచి మైలేజ్ క్రియేట్ చేసింది.. అది రిజల్ట్స్ రాకముందు మాట.. కానీ ఫలితాలు వచ్చాక పరిస్థితి అంతా తారుమారు అయ్యింది. 

రామమందిరం సెంటిమెంట్ దేశంలో అన్ని నియోజకవర్గాల్లో కాస్త వర్క్అవుట్ అయినా.. గుడి కట్టిన ఫజియాబాద్ నియోజకవర్గంలో మాత్రం రాముడు బీజేపీని కరుణించలేదు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అవదీశ్ ప్రసాద్ బీజేపీ అభ్యర్థిపై 45వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించాడు. గత ఎన్నికల్లో కంటే తక్కువ సీట్లు ఈసారి ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలుచుకుంది. రామజన్మ భూమి సెంటిమెంట్ సొంతరాష్ట్రంలోనే ఫలించలేదు.  దాని వెనుక కారణాలు ఏంటో ఇప్పడు తెలుసుకుందాం...

* బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ కు అక్కడ ఉన్న వ్యతిరేకత


అయోధ్యలో దళితులు అతిపెద్ద ఓట్ బ్యాంక్. 9సార్లు గెలిచిన దళిత ఎమ్మెల్యే ఎస్పీ అభ్యర్థి అవదీశ్ ప్రసాద్ ను సవాజ్ వాదీ పార్టీ అక్కడ నిలబెట్టింది. దీంతో దళితుల ఓట్ బ్యాంక్ అటు మళ్లింది.  అంతే కాదు చిన్న వ్యాపారులను, ఉపాది పొందే యువకులను పెద్ద హోటల్స్, కంపెనీలు దెబ్బతీశాయి. లల్లూ సింగ్ అయోధ్య, ఫజియాబాద్ నగరాల్లో మాత్రమే ప్రచారంపై దృష్టి పెట్టారు. దీంతో ప్రత్యర్థి అవదీశ్ ప్రసాద్ లల్లూపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకువడంలో సక్సెస్ అయ్యాడు.

*ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం

రామమందిర నిర్మాణం కోసం బారీగా విరాళాలు ఇచ్చిన అక్కడి ప్రజలకు ఇల్లు, ఉపాధి, కుటుంబ పోషణ, హెల్త్ లాంటి అవసరాలు అధికార పార్టీ తీర్చలేదు. అలాగే గుడి నిర్మాణానికి అక్కడి ప్రజలు స్వతహాగా పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చి.. దయనీయ పరిస్థితిలో పడ్డారు. అయోధ్యలో కార్పరేట్ బిజినెస్ ఎక్కువైంది ఇది కూడా ఒక కారణమే..

* లోకల్స్‌లో నిరాశ

అయోధ్యలో మందిర నిర్మాణంపై 30 ఏళ్లకు పైగా సాగిన బాబ్రీ మసీదు కేసును అంతం చేస్తామని బీజేపీ గతంలో హామీ ఇచ్చింది. దీంతోనే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మసీదు కేసుతో అన్ని ఏళ్లు ఉండటంతో ప్రజలు విసిగిపోయారు. ఎంతసేపున్నా రామమందిర నిర్మాణ గురించే అనే అంశాన్నే బీజేపీ తెస్తోంది. కానీ అక్కడి ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చడంలో విఫలమైంది. దీంతో మోసపోయామని స్థానికులు భావించారు. అనేక UP ప్రాంతాలలో BJP పతనానికి కారణం ప్రాథమిక అవసరాలను పట్టించుకోకపోవడం పట్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి. అంత పెద్ద పర్యాటక ప్రాంతంలో స్థానికులకు ఉపాధి కరువైంది. ఇది బాగా వారిని నిరాశకు గురిచేసింది. వేరే ప్రాంతం వారు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడం.. స్థలాలు కోల్పోయిన వారిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఫజియాబాద్ ఓటమికి కారణమైంది.

*రాముడి భూమిలో  అసంతృప్తి

గుడి నిర్మాణంలో స్థలాలు, ఇళ్లు, ఇంకా పక్కనే ఉన్న చిన్న చిన్న దేవాలయాలు కూల్చేసారు. ఈ విషయం స్థానికుల్లో బాగా వ్యతిరేకత తెచ్చింది. అయోధ్యలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అక్కడ చిన్న చిన్న లీడర్లు బయటకు తీసుకువచ్చారు. అంతే కాదు ముల్లీలు అక్కడ ఆలయాన్ని ఉపాది పొందడం, అయోధ్య చుట్టు ప్రక్కల ఉన్న భూముల కొనుగోళ్లలో అవినీతి జరిగింది.

* అధికార వ్యతిరేకత ఎక్కువై..

రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీపై వ్యతిరేకత రావడం ఎక్కడైనా కామన్.. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు దాన్ని వాడుకోవడంలో విజయవంతమైయ్యారు. అయోధ్య ఎమ్మెల్యే, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి అయోధ్య ప్రజల కోసం ఏ పనీ చేయలేదు. ఏ పని చేసినా బయటివారి కోసమే. అయోధ్య ప్రజల కోసం పని చేయడం బీజేపీ మరిచిపోయిందనే భావన అక్కడ ప్రజల్లో బాగా వ్యాపించింది. అలాగే రాజ్యాంగాన్ని మార్చాలంటే బీజేపీకి 400 సీట్లు అవసరమని లల్లూ సింగ్ అన్నారు.  ఫజియాబాద్ ఓటమికి బీజేపీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఓ కారణం.