కరోనా సబ్‌స్టిట్యూట్‌కు గ్రీన్ సిగ్నల్
క్రికెట్ కమిటీ ప్రపోజల్స్‌కు ఐసీసీ సీఈసీ ఆమోదం
దుబాయ్: పోస్ట్ కరోనా మ్యాచ్‌ల్లో ప్లేయింగ్ కండీషన్స్ మార్చాలని అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ చేసిన ప్రపోజల్స్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) ఆమోద ముద్ర వేసింది. సలైవా బ్యాన్, ఇంటర్నేషనల్ సిరీస్‌లకు హోమ్ అంపైర్స్‌ను తీసుకోవడం వంటి ప్రపోజల్స్‌ను పూర్తి స్థాయిలో సమీక్షించిన కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్లేయర్లు, మ్యాచ్ అఫీషియల్స్ హెల్త్‌ను రిస్క్‌లో పెట్టకుండా.. క్రికెట్‌ను పూర్తిస్థాయిలో రీస్టార్ట్ చేయాలని కమిటీ ఈ నిర్ణయాలకు ఓకే చెప్పింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కోరుకున్నట్లుగానే.. ‘కరోనా సబ్‌స్టిట్యూట్’కు ఆమోద ముద్ర పడింది. మ్యాచ్ సందర్భంగా ఎవరైనా ప్లేయర్ కొవిడ్ లక్షణాలతో బాధపడితే…బదులుగా ఇంకో ఆటగాడిని తీసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే టెస్ట్‌ల్లో ‘కంకూషన్ రిప్లేస్‌మెంట్’ ఉంది. దీనికితోడు కరోనా సబ్‌స్టిట్యూట్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ రెండింటిలో దేనిని ఉపయోగించుకోవాలనేది మ్యాచ్ రిఫరీ నిర్ణయిస్తాడు. వన్డే, టీ20ల్లో మాత్రం కరోనా సబ్‌స్టిట్యూట్‌కు అవకాశం లేదు.
నాన్–న్యూట్రల్ అంపైర్స్‌కు ఒకే..
ఇంటర్నేషనల్ లెవల్‌లో ఎదురయ్యే లాజిస్టిక్ చాలెంజెస్‌ను పరిష్కరించేందుకు క్రికెట్ కమిటీ నాన్–న్యూట్రల్ అంపైర్ సిస్టమ్‌ను మళ్లీ తీసుకొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా కంట్రోల్‌లోకి వచ్చే వరకు ఈ పద్ధతిని పాటించనున్నారు. అంటే ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లోనూ హోమ్ కంట్రీ అంపైర్స్‌ను తీసుకుంటారు. ఐసీసీ ఎమిరైట్స్ ఎలైట్ ప్యానెల్ అఫిషీయల్స్‌తో కలిసి వీళ్లు పని చేస్తారు. క్రికెట్‌లో పారదర్శకత కోసం గతంలో హోమ్ కంట్రీ అంపైర్లకు అనుమతి లేదు. కానీ కరోనా కారణంగా ఎక్కువ మంది అంపైర్లు ట్రావెల్ చేయడం ఇబ్బందిగా ఉంటున్న నేపథ్యంలో పాత సిస్టమ్‌ను మళ్లీ తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ లెవల్‌లో కొత్త అంపైర్లకు ఎక్స్‌పీరియెన్స్ తక్కువగా ఉండటంతో.. ప్రతి టీమ్‌కు అదనంగా ఓ డీఆర్‌ఎస్‌ను కేటాయిస్తూ సీఈసీ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఇన్నింగ్స్‌లో అదనంగా ఒక డీఆర్‌ఎస్‌ను కేటాయించడం వల్ల టెస్ట్‌ల్లో వీటి సంఖ్య మూడుకు పెరిగింది. వైట్‌బాల్ ఫార్మాట్‌లో రెండుకు చేరింది. కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన ప్లేయర్లపై మ్యాచ్ రిఫరీ చేపట్టే విచారణ వీడియో ద్వారా జరగనుంది. దీనికి ఐసీసీ క్రికెట్ ఆపరేషన్స్ టీమ్ సహకరిస్తుంది. క్రికెటర్ల టెస్ట్ జెర్సీలపై అదనంగా మరో లోగోను ఉంచడానికి కూడా ఐసీసీ ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించిన రూల్స్‌ను రిలాక్స్ చేసింది. రాబోయే 12 నెలల వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ లోగో 32 స్క్వేర్ ఇంచ్‌లు ఉండాలి. టెస్ట్ మ్యాచ్ షర్ట్, స్వెటర్‌పై చెస్ట్ భాగంలో దీనిని ముద్రించాలి. పాత రెగ్యులేషన్ ప్రకారం ఉన్న మూడింటికి ఇది అదనం.
రెండుసార్లు వార్నింగ్
మ్యాచుల్లో బాల్‌ను షైన్ చేసేందుకు సలైవాను ప్లేయర్లు ఉపయోగించకూడదు. ఈ ప్రతిపాదనకు సీఈసీ ఓకే చెప్పింది. ఒకవేళ మ్యాచ్ ఆరంభంలో ఎవరైనా ప్లేయర్ సలైవాను ఉపయోగిస్తే అంపైర్లు దీనిని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తారు. ప్లేయర్లు అడ్జెస్ట్ కావడానికి టైమ్ పడుతుంది కాబట్టి పెద్దగా చర్యలు ఉండవు. కానీ అదే పనిగా ఉపయోగిస్తే మాత్రం టీమ్‌కు హెచ్చరికలు జారీ చేస్తారు. ఇలా ప్రతి ఇన్నింగ్స్‌లో రెండుసార్లు వార్నింగ్ ఎదుర్కొంటే 5 రన్స్ పెనాల్టీ విధిస్తారు. బ్యాటింగ్ టీమ్ స్కోరుకు వీటిని జత చేస్తారు. సలైవాను ఉపయోగించిన బాల్‌ను మళ్లీ శుభ్రం చేసిన తర్వాతే ఆటను మొదలుపెట్టనున్నారు.
For More News..