ఇన్ఫోసిస్ కు ఐదుగురు.. యస్.బి.ఐ.టి. విద్యార్థుల ఎంపిక

ఇన్ఫోసిస్ కు ఐదుగురు.. యస్.బి.ఐ.టి. విద్యార్థుల ఎంపిక

ఖమ్మం, వెలుగు: ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ కంపెనీ కి తమ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు ఎస్బీఐటీ కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. గత వారం హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్యాంపస్ పూల్ డ్రైవ్​లో తమ విద్యార్థినులు అద్భుత ప్రతిభను కనబరచారని, జిల్లాలో అత్యధికంగా ఐదుగురు ఎంపికవ్వడం తమకు గర్వకారణమని కృష్ణ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఆరు నెలల పాటు శిక్షణలో భాగంగా రూ.3.60 లక్షలు అందుకుంటారని, తర్వాత రూ. 9 లక్షల పైచిలుకు వార్షిక వేతనం పొందుతారని తెలిపారు.