హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులు డైరెక్టర్ ఆఫ్ జనరల్ (డీజీ)లుగా పదోన్నతి పొందారు. 1994 బ్యాచ్‌కు చెందిన శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్, అభిలాష బిస్త్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి డీజీ హోదా కల్పిస్తూ సీఎస్ శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐడీ చీఫ్ షికా గోయల్, జైళ్ల శాఖ చీఫ్ సౌమ్య మిశ్రా, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ వారివారి స్థానాల్లో డీజీ హోదాలో పనిచేయనున్నారు. ఆదేశాలు వెలువడిన వెంటనే శివధర్ రెడ్డి డీజీగా చార్జ్ తీసుకున్నారు.