
- రూ.25లక్షల ఆస్తి నష్టం
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మీదుగా వెళ్లే 43వ జాతీయ రహదారి పెర్కిట్ శివారులో బుధవారం తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్‌తో ఐదు దుకాణాలు దగ్ధం కాగా, రూ.25లక్షల ఆస్తి నష్టం జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. పెర్కిట్ శివారులోని భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన గల 5 వ్యాపార సముదాయాల్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది.
వరుసగా ఉన్న కిరాణా షాప్, టీ టిఫిన్ సెంటర్, ఆటో మొబైల్ షాపులు అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.