ఈ వారం 6 ఐపీఓలు..10 లిస్టింగ్‌‌‌‌లు

ఈ వారం 6  ఐపీఓలు..10 లిస్టింగ్‌‌‌‌లు

న్యూఢిల్లీ: ఐపీఓ మార్కెట్ కళకళలాడుతోంది.  డొమెస్టిక్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (డీఐఐలు), ఫారిన్ పోర్టుపోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌పీఐలు)  ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేస్తుండడంతో  ప్రైమరీ మార్కెట్‌‌‌‌ దూసుకుపోతోంది.   ఈ వారం  ఐదు ఎస్‌‌‌‌ఎంఈ ఐపీఓలు, ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ  ఓపెన్ కానున్నాయి.

1. గాలా ప్రెసిసన్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌ 
ప్రెసిసన్ కాంపోనెంట్లను తయారు చేసే మహారాష్ట్రకు చెందిన ఈ కంపెనీ మెయిన్‌‌‌‌ బోర్డ్ ఐపీఓ ద్వారా రూ.168 కోట్లు సేకరించాలని చూస్తోంది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 2 న  ఓపెనై 4 న  ముగుస్తుంది. ఒక్కో షేరుని రూ.503–529 ప్రైస్‌‌‌‌ బ్యాండ్‌‌‌‌లో అమ్ముతున్నారు. 
2. జెయ్యం గ్లోబల్ ఫుడ్స్ 
ఎస్ఎంఈ సెగ్మెంట్‌‌‌‌లో ఐపీఓకి వస్తున్న జెయ్యం గ్లోబల్ ఫుడ్స్‌‌‌‌ రూ.81.94 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఈ కంపెనీ ఐపీఓ సెప్టెంబర్ 2 న ఓపెనై 4 న ముగుస్తుంది. ఒక్కో షేరుని రూ.59–61 ప్రైస్‌‌‌‌ బ్యాండ్‌‌‌‌లో అమ్ముతున్నారు. 
3. నేచర్‌‌‌‌‌‌‌‌వింగ్స్‌‌‌‌ హాలిడేస్‌‌‌‌ 
కోల్‌‌‌‌కతా బేస్డ్‌‌‌‌ ఎస్‌‌‌‌ఎంఈ కంపెనీ నేచర్‌‌‌‌‌‌‌‌వింగ్స్ ఐపీఓ సెప్టెంబర్ 3న ఓపెన్‌‌‌‌ అవుతుంది. సెప్టెంబర్ 5 వరకు అందుబాటులో ఉంటుంది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ.74. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.7.03 కోట్లు సేకరించాలని కంపెనీ చూస్తోంది.
4. మాక్‌‌‌‌ కాన్ఫరెన్స్ అండ్ ఈవెంట్స్‌‌‌‌
 మాక్ కాన్ఫరెన్స్‌‌‌‌ ఐపీఓలో ఒక్కో షేరుని రూ.214–225 ప్రైస్ బ్యాండ్‌‌‌‌లో అమ్ముతోంది. కంపెనీ ఐపీఓ సెప్టెంబర్ 4–6 మధ్య ఓపెన్‌‌‌‌లో ఉంటుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.50.15 కోట్లు సేకరించాలని మాక్ కాన్ఫరెన్స్ ప్లాన్ చేస్తోంది. 
5. మై ముద్రా ఫిన్‌‌‌‌కార్ప్‌‌‌‌
మరో ఎస్‌‌‌‌ఎంఈ ఐపీఓ మై ముద్రా ఫిన్‌‌‌‌కార్ప్‌‌‌‌ ఈ నెల 5న ఓపెన్ కానుంది. ఒక్కో షేరుని రూ.1‌‌‌‌‌‌‌‌04–110 ప్రైస్ బ్యాండ్‌‌‌‌లో అమ్ముతున్నారు. 
6. నమో ఈవేస్ట్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌
ఈవేస్ట్‌‌‌‌ను సేకరించడం, తొలగించడం, రీసైక్లింగ్ చేయడం వంటి సర్వీస్‌‌‌‌లు అందించే నమో ఈవేస్ట్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఐపీఓ ద్వారా రూ.51.2 కోట్లు సేకరించాలని చూస్తోంది. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 4 న ఓపెనై 6న ముగుస్తుంది. ఐపీఓలో ఒక్కో షేరు ధర రూ. 80–85.
7. వీటితో పాటు పది కంపెనీలు ఈ వారం మార్కెట్‌‌‌‌లో లిస్టింగ్ కానున్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్‌‌‌‌ సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 3న మార్కెట్‌‌‌‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఎకోస్‌‌‌‌ ఇండియా మొబిలిటీ షేర్లు సెప్టెంబర్ 4 న, బజార్ స్టైల్ రిటైల్‌‌‌‌ షేర్లు సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 6న మార్కెట్‌‌‌‌లో లిస్టింగ్ కానున్నాయి. ఇండియన్ ఫాస్ఫేట్‌‌‌‌, విదెల్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌, జై బీ లామినేషన్స్‌‌‌‌ సెప్టెంబర్ 3న లిస్టింగ్ అవుతాయి.