కాంగ్రెస్ మేనిఫెస్టో : తెలంగాణలో 5 ప్రత్యేక ఇండస్ట్రియల్ కారిడార్లు

కాంగ్రెస్ మేనిఫెస్టో : తెలంగాణలో 5 ప్రత్యేక ఇండస్ట్రియల్ కారిడార్లు

పార్లమెంట్ ఎన్నికల క్రమంలో.. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. ఆ కారిడార్లు ఏంటో వివరంగా చూద్దాం...

1. హైదరాబాద్ -టూ- బెంగళూరు ఐటీ ఆండ్ ఇండస్ట్రియల్ కారిడార్
2. హైదరాబాద్  టూ నాగపూర్  ఇండస్ట్రియల్ కారిడార్
3. హైదరాబాద్   టూ వరంగల్  ఇండస్ట్రియల్ కారిడార్
4.  హైదరాబాద్   టూ నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్
5.  సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు 

రాష్ట్ర అవసరాలు ఆలోచించి మరీ మేనిఫెస్టో తయారుచేశామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.  ఇందులో 23 అంశాలు చేర్చినట్లు చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే విభజన చట్టం హామీలు అమలు చేస్తామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పారు. సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఏపీలో కలిపిన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో విలీనం చేస్తామన్నారు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు పెంచుతామని చెప్పారు. ఈ  మ్యానిఫెస్టోను పార్టీ నేతలు, కార్యకర్తలు.. ప్రతి గడపకు తీసుకెళ్లాలని సూచించారు.