రోజు రోజుకు వేగంగా మారుతున్న ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతలు నేర్చుకోవడం అత్యంత ముఖ్యం. ప్రస్తుత కాలంలో ప్రతీ రంగంలో పోటీతత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఇతరుల కంటే ముందంజలో ఉండాలంటే ముఖ్యమైన ఐదు అత్యాధునిక సాంకేతికతను తప్పక నేర్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఉద్యోగాలు పొందడం..చేస్తున్న ఉద్యోగాలను కాపాడుకోవడం చాలా కష్టతరం అవుతుంది. ఆ ఐదు అత్యాధునిక సాంకేతిక అంశాలేంటో చూద్దాం..
డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వివిధ రంగాలను గణనీయంగా ప్రభావితం చేసే అంశాలు. ఈ రెండింటి ప్రాముఖ్యత ఈ ఏడాదిలో మరింత పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణలు..సంస్థలు తమ డేటాను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. ఈ సమాచారం ఆటోమేషన్ ప్రాసెస్ తో పాటు..ప్రిడిక్టివ్ అనలిటిక్ లను సులభతరం చేస్తాయి.
ALSO READ: ఖర్చుల కోసం అప్పులు చేస్తోన్న భారతీయులు .. పెరిగిన క్రెడిట్ కార్డుల వినియోగం
ఎడ్జ్ కంప్యూటింగ్..
రియల్ టైం డేటా ప్రాసెసింగ్ అవసరమైన సమయంలో ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది సాంకేతికంగా చాలా ముఖ్యమైనది. డేటా సోర్స్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు, జాప్యాన్ని తగ్గించేటప్పుడు ఈ డేటా ఆధారిత కార్యకలాపాలు మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తాయి. డేటా ప్రాసెసింగ్ లో నిర్ణయాలు తీసుకోలేని సమయాల్లో ఎడ్జ్ కంప్యూటింగ్ అప్లికేషన్లు సహాయపడతాయి.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరిశ్రమలను స్మార్ట్ గా మారుస్తుంది. ఇంటర్నెంట్ ఆఫ్ థింగ్స్ పరికరాలు రిమోట్ మానిటరింగ్ , ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, మెరుగైన రిసోర్స్ మేనేజ్ మెంట్ ను ఎనేబుల్ చే్తూ..డేటాను సేకరించి ..షేర్ చేస్తాయి. ఈ ఏడాదిలో ఇంటర్నెంట్ ఆప్ థింగ్స్ మరింత విస్తరిస్తుంది. ఇది కస్టమర్ సమర్థత, స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.
సుస్థిరమైన సాంకేతికత..
ప్రతీ పరిశ్రమలో సుస్థిరమైన సాంకేతికత అనేది కీలకమైన అంశం. ఈ సుస్థిర సాంకేతికత వ్యాపారాల్లో పర్యావరణ సంబంధిత కస్టమర్ల డిమాండ్ ను సంతృప్తి పరుస్తాయి. వారి సమస్యలకు స్థిరమైన పరిష్కారాలను చూపిస్తాయి. సుస్థిర సాంకేతికత అనేది ఫ్యాషన్, ఆహార తయారీ, శక్తి వంటి వివిధ పరిశ్రమలలో వ్యాపారాలకు పోటీతత్వాన్ని అందిస్తుంది.
5G టెక్నాలజీ
5జీ టెక్నాలజీ ప్రారంభంతో డేటా ట్రాన్స్ మిషన్, కనెక్టివిటీపై బలంగా ఆధారపడే సెక్టార్ లు పెరిగిపోయాయి. ఇంటర్నెంట్ ఆఫ్ థింగ్స్ పరికరాల విస్తరణ, 5జీతో వేగవంతమైన ఇంటర్నెట్ తో రియల్ టైం కమ్యూనికేషన్ సాధ్యపడుతుంది. టెలిమెడిసిన్, డ్రైవర్ లెస్ వాహనాలు, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి రంగాలు 5జీ సాంకేతికతతో గణనీయంగా ప్రభావితమవుతాయి.
ఏ ఉద్యోగి అయినా..ఏ సంస్థలో అయినా విజయం సాధించాలంటే మారుతున్న కాలానికి తగ్గట్లు, రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికను అందిపుచ్చుకోవాల్సిందే. ప్రతీ సంస్థ కూడా ఈ అత్యాధునిక సాంకేతికతలపై తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. దీని వల్ల తమ వ్యాపారం వృద్ధి చెందడంతో పాటు..భవిష్యత్ వ్యాపార ప్రమాణాలను కూడా పెంచుతుంది.